AP

ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజుల పెంపు..!

ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్య (మెడికల్) కోర్సుల ఫీజులను ప్రభుత్వం సవరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం, పీజీ కోర్సుల ఫీజును 15 శాతం పెంచుతూ వైద్యారోగ్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన రుసుములు 2026-27 విద్యాసంవత్సరానికి వర్తించనున్నాయి.

ఎంబీబీఎస్ (MBBS) ఫీజులు:

  • కన్వీనర్ కోటా: రూ. 18,150

  • మేనేజ్‌మెంట్ కోటా: రూ. 14.52 లక్షలు

  • ఎన్నారై కోటా: రూ. 43.56 లక్షలు

బీడీఎస్ (BDS) ఫీజులు:

  • కన్వీనర్ కోటా: రూ. 15,730

  • మేనేజ్‌మెంట్ కోటా: రూ. 4.84 లక్షలు

  • ఎన్నారై కోటా: రూ. 14.52 లక్షలు

పీజీ (PG) & సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఫీజులు:

  • పీజీ కన్వీనర్ కోటా: రూ. 5.71 లక్షలు

  • పీజీ మేనేజ్‌మెంట్ కోటా: రూ. 11.42 లక్షలు

  • పీజీ ఎన్నారై కోటా: రూ. 66.12 లక్షలు

సూపర్ స్పెషాలిటీ కోర్సులు: రూ. 19.38 లక్షలు