AP

బీసీల విషయంలో ఇద్దరూ వెన్నుపోటు దారులే: వైఎస్ షర్మిల..!

రిజర్వేషన్ల పెంపు పేరుతో నారా చంద్ర బాబు సైతం బీసీలను బురిడీ కొట్టించారని అన్నారు. జీవోలతో 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని, న్యాయస్థానాల ముందు నిలబడవని, 50 శాతం మించకూడదనే సుప్రీం ఆదేశాలు ఉన్నాయని, రిజర్వేషన్లు పెరగాలంటే చట్టాలు చేయాలని తెలిసి, రిజర్వేషన్ల పెంపు పేరుతో డెడికేషన్ కమిషన్ పేరుతో చంద్రబాబు ఆడింది రాజకీయ డ్రామాలని అన్నారు.

రిజర్వేషన్ల పెంపు అని గత YCP ప్రభుత్వం జీఓ 176 ఇచ్చి బీసీలను మోసం చేస్తే, న్యాయం చేస్తామని నమ్మబలికి జీఓలు 105, 1065 ఇచ్చి చంద్రబాబు సైతం చేసింది నమ్మకద్రోహం కాదా అని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీలకు చంద్రబాబు పొడిచింది వెన్నుపోటు. ఎన్నికల్లో లబ్ధి కోసం రిజర్వేషన్ల పెంపు పేరిట వేసింది కపట నాటకాలని, హైకోర్టులో రిజర్వేషన్ల పెంపుపై జీవోలు మరోసారి కొట్టివేసినందుకు చంద్రబాబు నైతిక భాద్యత వహించాలని, అమలు కానీ హామీ ఇచ్చినందుకు బీసీలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

బీసీలకు నిజంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలో ఉన్నది మీ అనుబంధ బీజేపీ ప్రభుత్వమే కదా.. కేంద్రాన్ని ఒప్పించి చట్టాలు చేయండని అన్నారు. కాలయాపన రాజకీయాలకు స్వస్థి పలికి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించండనా, సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న మీ నిర్ణయం మీద కనీసం సర్వోన్నత న్యాయస్థానంలోనైనా సరైన వాదనలు వినిపించండని అన్నారు. బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ల అమలు జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాంమని ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు.