కేంద్ర ఎన్నికల సంఘం వివాదంపై దేశవ్యాప్తంగా చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కీలక సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అక్టోబర్ 5న ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్‌ఛార్జ్‌లు, అన్ని రాష్ట్రాల PCC అధ్యక్షులు పాల్గొననున్నారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ మిగిలిన ఇద్దరు కమిషనర్లను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ వివాదంపై ఇప్పటికే విపక్షాల ‘ఇండియా’ కూటమి కూడా ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చింది. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ మార్చ్‌లు నిర్వహించాలని నిర్ఫయించుకున్నారు.
అలాగే అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపీలందరూ కలిసి ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం వైపు నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇండియా కూటమి ఉమ్మడి నిరసనలతో పాటు, క్షేత్రస్థాయిలో ఈ ఆందోళనలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడంపై చర్చించేందుకే అక్టోబర్ 5న ఈ ప్రత్యేక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిది

