CINEMA

ఆ తమిళ డైరెక్టర్ తో నాని..! మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడా..?

నాని..టాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ న్యాచురల్ స్టార్ ఇపుడు సరికొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడట.

విషయంలోకి వెళ్తే తన సొంత బ్యానర్ ‘వాల్ పోస్టర్ సినిమా’ ద్వారా కొత్త టాలెంట్‌ను, సరికొత్త కథలను ఎంకరేజ్ చేసే నాని నితిన్ హీరోగా ‘అలియాస్ రుక్మిణీ’ అనే క్రేజీ సినిమాని నిర్మించిన సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాకి నాని సోదరి దీప్తి గంటా ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ కానున్న సందర్బంగా ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్.ఈ క్రమంలో ‘అలియాస్ రుక్మిణీ’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో దీప్తి గంటా చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

గత కొంతకాలంగా కోలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయబోతున్నారంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోవడం తో డైలమాలో పడిపోయారు ఫ్యాన్స్.

ఇక తాజాగా దీప్తి గంటా మాట్లాడుతూ నాని, ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌లో సినిమా ఉండబోతోందని, ఆ ప్రాజెక్ట్ నిజమేనని కన్ఫర్మ్ చేయడంతో హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయారు నాని ఫ్యాన్స్ .

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ’96’ సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్, ఆ తర్వాత తెలుగులో ‘జాను’, ఇటీవల కార్తీ, అరవింద్ స్వామిలతో ‘సత్యం సుందరం’ లాంటి ఎమోషనల్ క్లాసిక్ ని తెరకెక్కించిన సంగతి తెల్సిందే.మనుషుల మధ్య ఉండే సెన్సిబుల్ ఎమోషన్స్ ని , జ్ఞాపకాలని తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో ప్రేమ్ కుమార్ ది అందె వేసిన చెయ్యని గత సినిమాలు ప్రూవ్ చేశాయి.

మరోవైపు ఎమోషనల్ సీన్స్ అదరగొడతాడని ‘జెర్సీ’, ‘హాయ్ నాన్న’ దసరా వంటి ఎన్నో సినిమాలతో నిరూపించుకున్నాడు నాని .అయితే వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నాని ఈ ఏడు ‘ది ప్యారడైజ్’ అంటూ డిజాస్టర్ ని మూట గట్టుకోవడం తో ఇపుడు తిరిగి తన జానర్ అయిన ఫీల్ గుడ్ మూవీ తో మరోసారి పలకరించడానికి రెడీ అయిపోయాడన్న మాట.

అయితే ప్రేమ్ కుమార్ సినిమా, సుజిత్ బ్లడీ రోమియో అయ్యాక మొదలవుతుందా ..లేక ప్యార్లల్ గా షూట్ జరుపుకుంటుందా అన్నది మరికొద్ది రోజులు అయితే గాని తేలేలా లేదు.చూడాలి మరి కన్ఫర్మ్ అయిన ఈ సినిమా ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ అవుతుందో