CINEMA

వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ సినిమాల్లో నటుడిగా నటించడమే కాకుండా సినిమాలను నిర్మించి స్టార్ నిర్మాతగా కూడా మారారు బండ్ల గణేష్. ఈయన ఇండస్ట్రీలో తన సినిమాలతో తన మాటలతో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చాలా వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. గతంలో పూరి జగన్నాథ్ ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మెగాస్టార్ అంటూ మరో కామెంట్స్ చేసి వారి అభిమానులకు కోపం తెప్పిస్తూ నిత్యం సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతూ ఉన్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ (Bandla Ganesh) తన గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నేను మా మామయ్య కూతురిని పెళ్లి చేసుకున్నాను. నేనెప్పుడు కూడా తప్పుంటే తప్పనే చెబుతాను. కానీ తప్పును ఒప్పు అని చెప్పను. అలాగే రాష్ట్రంలో ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకే సపోర్ట్ చేయాలి.

అందుకే నేను కెసిఆర్ చేసే మంచి పనులను నేను ప్రతిసారి మెచ్చుకుంటూ ఉంటాను. ఒకప్పుడు నన్ను చూసిన వాళ్ళు చాలామంది నువ్వు హైదరాబాదులో ఎందుకు ఉంటున్నావ్ షాద్ నగర్ వెళ్లి అక్కడ కోళ్ల వ్యాపారం పెట్టుకో అంటూ చాలా దారుణంగా అవమానించారు. కానీ నన్ను అలా అవమానించిన వాళ్ళందరూ చనిపోయారు. ప్రస్తుతం నేను మంచి పోజిషన్ లో ఉన్నాను. నేను కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాను. నా దగ్గర దాదాపు 1,000 కి పైగా పని వాళ్లు పని చేస్తున్నారు. అలాగే నేను ఏదైనా కరెక్ట్ ఉంటేనే ఆ పాయింట్ మాట్లాడుతాను. అంతేకానీ అభిమానులను రెచ్చగొట్టే విధంగా నేను ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయను.అలాగే రామ్ చరణ్ (Ram Charan) కి నాకు మధ్యలో ఎలాంటి గొడవ లేదు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు. నేను కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేశాను. ఆ సినిమాలు నాకు మంచి సక్సెస్ ని అందించాయి. అలాగే నా సినీ కెరీర్ ఇలాగే సక్సెస్ఫుల్గా సాగాలని నేను కోరుకుంటున్నాను అని బండ్ల గణేష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ (Bandla Ganesh) మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.