ప్రతి రోజు మనం చూసే తినే చేప ఖరీదు వందల్లో ఉంటుంది. కాస్త ఖరీదైన చేపలు వేల రూపాయల ధర కూడా పలుకుతాయి. సాదారణ జనాలు వందల్లో ఉన్న చేపలను తింటారు. కాస్త ధనవంతులు వేల రూపాయల ఖరీదు ఉండే చేపలను తింటారు. వందలు వేలు మాత్రమే కాకుండా లక్షలు, కోట్ల రూపాయల చేపలు కూడా ఉంటాయని మీకు తెలుసు. తాజాగా జపాన్ రాజధాని టోక్యో లోని ఒక మార్కెట్ లో జరిగిన వేలంలో టూనా చేప ఏకంగా 2.25 కోట్ల రూపాయల ధర పలికింది. 212 కిలోల బరువున్న ఈ చేప అత్యంత అరుదైన రకం చేపగా పేరు దక్కించు కుంది. ప్రతి ఏడాది ఈ చేప వేలం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా కోట్ల రూపాయల ధర పలికినట్టున్న మార్కెట్ వారు చెబుతున్నారు. చేప ఈ ఏడాది రెండు కోట్లకు పైగా రేటు పలికింది, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ టూనా చేప దేశ విదేశాలకు ఎగుమతి అవుతుందని తెలుస్తుంది. దేశంలోని అగ్రశ్రేణి వంట మాస్టర్లు మాత్రమే ఈ చేపను కట్ చేసి వంట చేస్తారట. అత్యంత ఖరీదైన ఈ చేప తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తీరిపోతాయని నమ్ముతారు అందుకే ఇంత భారీ రేటు ఉంటుందని అంటున్నారు.