ఈ మధ్య కాలంలో స్ట్రోక్స్ పెరిగాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీస్తున్నాయి. ఇందుకు వైద్యులు అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. అయితే, సమస్య వచ్చిన సమయంలో చికిత్స.మందులు ఎంత అవసరమో..సమస్య రాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు బిగ్ రిలీఫ్ ఇస్తాయంటున్నారు వైద్యులు.
ఒత్తిడి.. నిద్ర లేమి..శారీరక శ్రమ లేకపోవటం..ఆహారపు అలవాట్లు..ఇలా ఎన్నో కారణాలు సైలెంట్ గా ప్రాణాలను హరించటానికి కారణాలు అవుతున్నాయి.
ఈమధ్య కాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి. కరోనా తరువాత గుండె, నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది వీటి కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో అందరిలోనూ ఆరోగ్యం పైన అవగాహన పెంచుకోవాలనే తపన పెరిగింది. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు వెళ్ళి అక్కడ న్యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ సుధీర్ కుమార్ ను కలిసారు. తన తండ్రికి పెరాల్సిస్ స్ట్రోక్ రావటంతో తనకు భవిష్యత్ లో రాకుండా మందులు ఇవ్వాలని డాక్టర్ ను కోరారు. దీనికి డాక్టర్ మందులు కాకుండా..ఆరు పిల్స్ రాస్తున్నాను…అవి ఫాలో అవ్వండంటూ సూచించారు.