AP

నియోజవకర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు

వై నాట్ 175. సీఎం జగన్ ఈ ఎన్నికలకు ఫిక్స్ చేసిన టార్గెట్. ఇప్పటికే నియోజవకర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. పలు మార్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు.

గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. సర్వేల్లో వెనుకబడి ఉన్న అభ్యర్ధులకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచనలు చేసారు. ఇక, ఇప్పుడు మంత్రుల్లో తిరిగి సీట్లు దక్కేదెవరికి..వారి గెలుపు అవకాశాల పైన చర్చ మొదలైంది. అందులో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ నియోజకవర్గం పైన కొత్త చర్చ మొదలైంది.

 

మంత్రి రజనీ నియోజకవర్గంలో : మరో తొమ్మది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అమరావతి జిల్లాల్లో టీడీపీ ఈ సారి ఆశలు పెట్టుకుంది. దీంతో..అమరావతి పరిధిలో సీఎం జగన్ వైసీపీ అభ్యర్ధుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

మంగళగిరి, తాడికొండ తో పాటుగా గుంటూరు..క్రిష్ణా జిల్లాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. గుంటూరు జిల్లా నుంచి ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో మంత్రి రజనీ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి అనూహ్యంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పైన విజయం సాధించారు. కేబినెట్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

రజనీకి సీటు ఖాయమా : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రి రజనీ ఇప్పటికే సిద్దం అవుతున్నారు. అక్కడ వైసీపీ నుంచి రజనీకి సీటు ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వంలో మంత్రిగా.. పార్టీ వ్యవహారాల్లోనూ రజనీ యాక్టివ్ గా ఉండటంతో మరోసారి సీటు ఖాయమని తెలుస్తోంది. ఇందు కోసం రజనీ మరోసారి గెలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడ టీడీపీలో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి ఇదే సీటు నుంచి తనకు సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. బాష్య ప్రవీణ్ అనే రియల్ వ్యాపారి ఇప్పుడు చిలకలూరి పేటలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. లోకేశ్ పేర్లతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. తాజాగా జరిగిన మహానాడులోనూ పార్టీకి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారు. బాష్యం ప్రవీణ్ కు సీటు ఖరారు అనే ప్రచారం పైన తాజాగా ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు.