AP

విశాఖలో పట్టాలు తప్పిన రైలు

విశాఖపట్నం జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. లోకో పైలట్ (రైలు డ్రైవర్) అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల పునరుద్ధరణకు ఏర్పాట్లు ప్రారంభించారు. మంగళవారం విశాఖపట్నం-కిరండల్ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం జిల్లా కాశీపట్నం సమీపంలో పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రైలు ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పిందని, అయితే రైలు బోల్తా పడకుండా ఓ వైపు ఒరిగి ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. రై

లు డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని వారు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశారు. Also Read: British Man Fined: సిగరెట్ పీక రోడ్డుపై వేసినందుకు రూ.55 వేల జరిమానా.. ఎక్కడంటే..? ఇదిలా ఉండగా కొండ ప్రాంతాల్లో అత్యంత చలిగాలులు ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒకవైపు పండుగ, మరోవైపు ఈ సీజన్‌లో విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టాలు తప్పిన బోగీని అక్కడే వదిలిపెట్టి ప్రయాణికులతో రైలు ముందుకు కదిలింది.