Technology

నోకియా వారి సరికొత్త సంచలనం.. మళ్లీ ప్రభంజనం

స్మార్ట్ ఫోన్ లు రాక ముందు ఫీచర్ ఫోన్స్ యుగంలో హెచ్ఎండి గ్లోబల్ సంస్థ నోకియా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. అప్పట్లో 90% మార్కెట్ ని దక్కించుకున్న నోకియా పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేక పోయింది. స్మార్ట్ ఫోన్ ల తయారి విషయంలో నోకియా ఇతర కంపెనీలతో పోటీ పడలేక పోయింది. ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటేందుకు ట్యాబ్లెట్‌ లతో మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. నోకియా టి21 ట్యాబ్లెట్‌ ను భారత మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది.

 

10.36 అంగుళాల డిస్‌ప్లే 4 జి బి రామ్, 64 జిబి స్టోరేజ్ తో ఈ ట్యాబ్లెట్‌ మార్కెట్లో అడుగు పెట్టింది. 8,200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 800 చార్జింగ్ సైకిల్స్ పూర్తి అయిన తర్వాత ఈ టాబ్లెట్ బ్యాటరీ 80% సామర్థ్యంతో పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. దీని బ్యాటరీ చాలా మన్నికతో ఉంటుందని నోకియా ప్రకటించింది. ఈ ట్యాబ్లెట్‌ ధర 19000 నిర్ణయించింది. వైఫై తో వైఫై లేకుండా ఈ ట్యాబ్లెట్‌ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. నోకియా అధికారిక వెబ్ సైట్‌ లో ముందుగా బుక్ చేసుకుంటే 1000 రూపాయలు డిస్కౌంట్ కూడా లభిస్తుందట. మొత్తానికి నోకియా మళ్లీ మార్కెట్లో రాణించేందుకు ఈ ట్యాబ్లెట్‌ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.