నీ మనసు నాకు తెలుసు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. మొదటి సినిమాతో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన వర్షం సినిమాతో ఆమె తనలో ఉన్న అందచందాలను నటనను బయటపెట్టి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక అలాంటి త్రిష వర్షం సినిమా తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా చాలా రోజులు ఇండస్ట్రీని ఏలింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అక్కడ కూడా వరుస సినిమాల్లో నటించింది. ఇక త్రిష (Trisha) చాలా రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరస సినిమాల్లో నటిస్తోంది. ఇక గత ఏడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో త్రిష అందానికి చాలామంది ఫిదా అయ్యారు. అంతేకాదు వయసు పెరుగుతున్న కొద్దీ త్రిష అందం మరింత పెరుగుతుంది అంటూ చాలామంది అభిమానులు త్రిష అందం చూస్తూ నివ్వెరపోయారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా త్రిష దాదాపు 35 కోట్లు పెట్టి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఇంటి పక్కన ఇల్లు కొనుగోలు చేసిందట. అయితే విజయ్ ఇంటి పక్కన ఇల్లు ఎందుకు కొనుగోలు చేసిందా చాలామంది ఆలోచనలో పడ్డారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రిష త్వరలోనే పెళ్లి చేసుకుని అదే ఇంట్లో ఉండబోతుందని ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన త్రిష (Trisha) ఇక పెళ్లి చేసుకొని ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ని మరోవైపు సినీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని భావిస్తుందట. అందుకే అన్ని కోట్ల విలువ చేసే ఇల్లు కొని త్వరలో తన భర్తతో కలిసి ఆ ఇంట్లో కాపురం చేయాలని భావిస్తుందట. ఇక ప్రస్తుతం త్రిష మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక పొన్నియన్ సెల్వన్ -2 (Ponniyan Selvan 2) సినిమా ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఏది ఏమైనప్పటికి త్రిష త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ ఏడాది అయినా త్రిష పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో వేచి చూడాలి