TELANGANA

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఓటు హక్కు అవసరంపై అవగాహన.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు రెడ్డిగూడెం పిఎస్134, నందు జాతీయ ఓటర్లు దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.స్కూల్ ప్రధానోపాధ్యాయులు(హెచ్ఎం) వసంత మరియు విఆర్ఏ రాము పాల్గొని ప్రసంగించారు. ప్రతీ ఏడాది జనవరి 25వ తేదీన ఇండియాలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటుంటామని తెలిపారు. ఓటు వేయడానికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన లక్ష్యమన్నారు.విద్యార్థులకు ఓటు హక్కు అవసరంపై అవగాహనా కల్పించారు.అనంతరం విద్యార్థులతో ముగ్గులు వేయించి ప్రతిజ్ఞలు చేయించి ముగ్గులేసిన విద్యార్థులకు ప్రధమ బహుమతి, ద్వితీయ బహుమతులు ఇవ్వటం జరిగింది.

ఈ కార్యక్రమంలో విఆర్ఏ రాము, అంగన్వాడి టీచర్ పల్లెల సత్యవతి, తిరుమలకుంట పీఎస్ లో బిఎల్వోలు వాణి, శ్రీనివాసమ్మ, పంచాయతీ సెక్రెటరీ నాగేశ్వరరావు, స్కూల్ హెచ్ఎం వసంత, మామిళ్లవారిగూడెం జిపిబిఎల్వో బుజ్జి, పంచాయతీ సెక్రెటరీ రమేష్, స్కూలు టీచర్స్ పాల్గొనడం జరిగింది