Uncategorized

సాగు భూములకు పట్టాలివ్వాలి……సానుకూలంగా స్పదించన తహశీల్దార్

 

పార్వతీపురం మన్యం జిల్లా : సాగు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, సిపిఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి .సంఘం కోరారు. పార్వతీపురం మండలం పెదమరికి పంచాయితి శివందొరవలస చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఈ పట్టాల విషయంపై గతంలో పలుమార్లు జిల్లా ఉన్నత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. అయితే నేడు తహశీల్దార్ కి మరలా వినతి పత్రం ఇవ్వగా..ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. కార్యక్రమంలో మెళ్లికి. చిన్నారావు, కొండ గొర్రి. శశిరేఖ, నామాల. గంగ, పి. గౌరమ్మ , పి. గంగమ్మ, నీలమ్మ, రాణి ,భారతీ, ప్రమీల , తదితరులు పాల్గొన్నారు