APTELANGANA

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం

4 H D ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వన విహార్ అర్బన్ పార్క్ లో ఫారెస్ట్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

భూమిపై ప్రాణికోటి మనుగడకు చిత్తడి నేలలే మూలం. చిత్తడి నేలలను భూమికి ఉన్న మూత్రపిండాలు అని కూడా అంటారు. ఇవి నీటి వనరులకు, మంచినీటికి మూలాలుగా ఉన్నాయి. భూమి ఉపరితలం నుంచి వ్యర్థాలను చిత్తడి నేలలు ఫిల్టర్ చేస్తాయి. మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇవి 4.63 శాతం వరకు ఉండటం విశేషం. వీటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న వరల్డ్ వెట్ల్యాండ్స్ డేను నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఈ ఏడాది (ఇట్స్ టైం టు రిస్టోర్ ది వెట్ ల్యాండ్స్) అనే థీమ్ ను యునెస్కో ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా వీటి పరిరక్షణ కోసం రామ్సార్ కన్వెన్షన్ను రూపొందించారు. మన దేశం 1982లో ఇందులో చేరింది.
నదులు, సరస్సులు, డెల్టాలు, ఉపరితల నీటి వనరులు, పగడపు దీవులు వంటివన్నీ చిత్తడి నేలల కిందకు వస్తాయి. కొన్ని సీజనల్ గా ఏర్పడతాయి. మరికొన్నింటిని మనుషులు అవసరాల కోసం నిర్మిస్తున్నారు. నీటి స్వభావంతో సంబంధం లేకుండా, వివిధ రకాల వివిధ ప్రాంతాల్లో నీటి వనరుల లోతు ఆరు మీటర్లకు మించని వాటిని చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. కాలుష్యం పెరగడం, పట్టణీకరణ, అభివృద్ధి వంటి కారణాల వల్ల భారతదేశంలో సహజంగా ఏర్పడిన చిత్తడి నేలలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. భారత్ ఇప్పటికే మూడింట ఒక వంతు చిత్తడినేలలను కోల్పోయిందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వీటిని కాపాడుకోవాలని ప్రభుత్వం ఇందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు..