AP

తారాస్థాయికి చేరిన గన్నవరం వైసీపీ నేతల విభేదాలు.. దుట్టా, యార్లగడ్డపై..!

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల అసంతృప్తి చల్లారకముందే కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే సహకరించేంది లేదని ఇద్దరు నేతలు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని వారు అధిష్టానానికి కూడా తెలిపినట్లు చెప్పారు. తాజాగా దుట్టా, యార్లగడ్డ మధ్య జరిగిన సంభషణపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ నియోజకవర్గానికి ఏం చేశారంటూ అనుచరుల మధ్య కూర్చుని మాట్లాడిని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొడాలి నాని ఏడో తరగతి ఫెయిల్ అయినోడు అంటూ యార్లగడ్డ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే వంశీ స్పందించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే డొక్క పగలకొట్టి డోలు కడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. పని పాట లేని వాళ్లు ఇలానే మాట్లాడతారని ..ఇలా మాట్లాడేవారిని ఏం చేయాలో తనకు, కొడాలి నానికి తెలుసని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. నియోజకవర్గానికి తాను ఏం చేశానో ప్రజలకు తెలుసన్నారు. నియోకవర్గానికి వలస వచ్చిన వారికి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో తెలియదని.. వార్డు మెంబర్‌కు కూడా గెలవని వాళ్లు మాట్లాడిని మాటలు పట్టించుకోనసవరం లేదన్నారు.