పార్వతీపురం మన్యం జిల్లా : 11 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి, సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సంఘం పిలుపునిచ్చారు. పట్టణ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ప్రధాన రహదారి గుండా వెళ్తూ ప్రచారకార్యక్రమం నిర్వహించారు. ఫిబ్రవరి 15-20 తేదీలలో పాట్నా- బీహార్ లో జరిగబోయే ఈ జాతీయ మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. గిరిజన, హరిజన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, లౌకిక వ్యవస్థను , రాజ్యాంగాన్ని , ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ పాలకొండ మండల కార్యదర్శి బెజ్జవరపు వెంకటరమణ, నామాల గంగ, పి. గౌరమ్మ , పి. గంగమ్మ, రాణి ,భారతీ, తదితరులు పాల్గొన్నారు.