TELANGANA

అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది

4 H D అక్రమ నిర్మాణాలకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పురపాలిక పెట్టింది పేరుగా మారింది. అనుమతులు లేకుండా చేపడుతున్న పనులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టి వాటికి ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారు. అక్రమ షెడ్ల నిర్మాణాలు కొందరు ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్నాయి.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ గా రూపాంతరం చెందిన తర్వాత అక్కడి అసైన్డ్ భూముల అమ్మకాలు కొనుగోళ్లులో వేగమ్మరింతపెరిగింది. క్రయ విక్రయాలు చేయరాదనే నిబంధన ఉన్నా.. ఇక్కడ అమలు కావడం లేదు. ప్రజాప్రతిని ధులు, రాజకీయ నాయకులే ఈ దందాను యథేచ్ఛగా చేస్తున్నారు. ఎక రాల చొప్పున కొనుగోలు చేసి గుంటల చొప్పున ప్లాట్లుగా తయారు చేసి అమ్ముతున్నారు. వారే అన్నీ చూసుకొని అడ్డదారిలో ఇంటి నంబర్లు కూడా ఇప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి……

గెర్రెకాలనీ సమీపంలోని సర్వేనెంబర్ 863 లో 8.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉండగా నూటికి నూరు శాంతం భూమి కబ్జాకు గురై కొందరు ఇల్లు నిర్మించుకోగా, మరికొందరు నిర్మాణ పనులు చేపట్టారు..ఈ సర్వే నెంబర్ భూమిలోని రెండు ఎకరాల భూమిని ఇటీవల ఓ ప్రజాప్రతినిది అతని అనుచరగణం కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇది విలువైన భూమి కావడంతో ఒక్కరిద్దరూ బడా నేతలు కూడా తెరవెనకాల ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.గెర్రెకాలనీలో సర్వేనెంబర్లు 858, 859,869, 883 లో ఉన్న ఆసైన్ భూములను రియల్టర్లు రాజకీయ నాయకుల అండదండలతో కొనుగోలు చేసి గుంటల చొప్పున ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులు సిమెంటు స్తంబాలతో హద్దులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరైతే గతంలోనే ఇంటి నెంబర్లను పొందినట్లు సమాచారం. మరికొందరు యథేచ్చగా షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా పురపాలిక, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెళువెత్తుతున్నాయి..కోట్ల విలువైన ప్రభుత్వ, మరియు అసైన్డ్‌ భూములను అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..