TELANGANA

ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం రామకృష్ణ మిషన్.

రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం స్థానిక దేవిపట్నం మండలం పోతవరం గ్రామం లో వైద్య శిబిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చలానందజీ మహారాజ్ తెలియ చేసినారు. అలాగే నీరుపేద కుటుంబాల వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు, సుమారు వంద మందికి రగ్గులు, లుంగీలను, రామ కృష్ణ మఠం మేనేజర్ స్వామి రఘువీరా నందజీ మహారాజ్ పంపిణీ చేశారు.
ఈ వైద్య శిబిరం లో సుమారు వంద మంది రోగులకు డాక్టర్ టి వి సుబ్బారావు వైద్య సేవలు అందించి అవసరమైన 41 మందికి రక్త పరీక్షలు చేసినట్లు స్వామీజీ తెలిపారు. ప్రతి నెల మూడవ శుక్రవారం పోతవరం గ్రామం లో వైద్య శిబిరం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్వామీజీ వివరించారు. ఈ వైద్య శిబిరం లో డాక్టర్ టి వి సుబ్బారావు,వలుంటీర్ ఎల్.ఎస్.జి భాగిరధ రాజు, రామ కృష్ణ మిషన్ కో-ఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.