AP

నూతన అన్నవరం ట్రస్టు బోర్డు మెంబెర్ దలే చిట్టిబాబుని అభినందించిన ఎమ్మెల్యే పర్వత

 

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ని అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నూతనంగా నియమితులైన దలే చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.ఎమ్మెల్యే పర్వత మరియు స్థానిక వైస్సార్సీపీ నేతలు చిట్టిబాబుని పూలమాలలు వేసి దుశ్శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా దలే చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో ఎమ్మెల్యే పర్వత ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు.ఎమ్మెల్యే పర్వత అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గంలో వైస్సార్సీపీ విజయానికి కృషి చేయడంతో పాటు అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పొలిటికల్ మేనేజర్ రామిశెట్టి చినబాబు,ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్,జడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి దొరబాబు, సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం,సొసైటీ చైర్మన్లు గొంతిన సురేష్, చెక్కపల్లి సత్తిబాబు,పత్రి రమణ,ఆకుల వీరబాబు,వైస్సార్సీపీ యువ నాయకుడు మామిడి నరసింహమూర్తి తదితర వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.