APTELANGANA

కలలో దేవుళ్ళు, దేవతా మూర్తులు: దేనికి సంకేతమో తెలుసుకోండి!!

స్వప్న శాస్త్రం ప్రకారం చాలామందికి కలలో దేవుళ్ళు, మరియు దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటారు. అలా కలలో దేవుడు కనిపించడం భవిష్యత్తులో జరిగే అనేక పరిణామాలకు సూచన అని చెబుతున్నారు.

స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రిపూట నిద్ర పోయే సమయంలో మనకు వచ్చే కలలు దేవుళ్ళు లేదా వివిధ దేవతలు కనిపిస్తే ఆ కలల యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కలలో శ్రీరాముడు కనిపిస్తే జీవితంలో గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థం. జీవితంలోపురోగతికి మార్గం తెరవబడుతుంది అని సంకేతం. కలలో లక్ష్మీదేవి కనిపిస్తే ఆకస్మిక ధన లాభం వస్తుందన్న సూచన. అంతే కాదు ఇంట్లో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి అన్న సంకేతం. కలలో శివలింగ దర్శనం అయితే జీవితంలో అప్పటివరకు పడిన అనేక కష్టాలు తొలగిపోతాయని సూచన.

కలలో శివలింగాన్ని చూడడం చాలా శ్రేయస్సును కలిగిస్తుంది. కలలో శివలింగ దర్శనం జీవితంలో మంచి సమయాన్ని తీసుకువస్తుంది. కలలో దుర్గ మాత దర్శనం శుభాలను చేకూరుస్తుంది. దుర్గామాత ఎర్ర చీర కట్టుకొని సింహంపై ప్రశాంత వదనంతో కనిపిస్తే అది మీ జీవితంలో శుభ సంకేతాలను తీసుకువస్తుంది.

అలా కాకుండా దుర్గామాత రూపంలో గర్జించే సింహంతో ఆగ్రహంతో కలలో కనిపిస్తే అది మీకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కలలో విష్ణుమూర్తి కనిపిస్తే అదృష్టానికి చిహ్నమని చెబుతున్నారు. కలలో విష్ణుమూర్తి దర్శనం జీవితంలో విజయానికి మరియు పురోగతికి మార్గాన్ని తెరవబడుతుంది అని చెబుతున్నారు.

రాత్రివేళ కలలో సరస్వతీదేవి కనిపిస్తే జీవితంలో వారు విద్యా రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు అన్న సంకేతం. కలలో హనుమాన్ కనిపిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు అన్న సంకేతంగా చెబుతున్నారు. కలలో శ్రీకృష్ణుడు కనిపించడం ప్రేమ సంబంధాలను మెరుగు పరుస్తుందని చెబుతున్నారు.