AP

జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి

జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీపీఎస్ ఉద్యమంతో మొదలైన ఆందోళనలను చల్లార్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు ప్రయత్నాలు చేస్తున్నా తాత్కాలిక ఉపశమనాన్ని కలిపిస్తుంది. నానాటికీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వైరం పెరుగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకుటీడీపీ, జనసేనతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు.

సీపీఎస్ ఉద్యమంతో మొదలు..

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తమ ప్రభుత్వం రాగానే వెంటనే సీపీఎస్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు చేయనున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆ మేరకు హామీ అమలుకు వేచి చూశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. అంతా సవ్యంగా జరుగుతుందని భావించిన ప్రభుత్వ ఉద్యోగులు… సీపీఎస్ రద్దు సాధ్యకాకపోవచ్చని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న మాటలు విని నిర్ఘాంతపోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. జగన్ తమను మోసం చేశారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టేందుకు సిద్ధమై అన్నంత పనీ చేశారు.

సమయానికి రాని జీతాలు

మార్చి తరువాత పెరిగిన జీతాలు చూసుకొని ఉద్యోగులు ఆనందం కంటే అసంతృప్తిని ఎక్కువగా వెళ్లగక్కారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు తీసుకునే వారు.. ప్రస్తుతం ఈ నెల జీతం పడుతుందో లేదో ఒకటికి పదిసార్లు మెసేజ్ లు చెక్ చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇటీవల గవర్నర్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు తమకు 1వ తేదీ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఉద్యోగులే ప్రభుత్వంపై అంతృప్తిని వెళ్లగక్కుతూ ఫిర్యాదులు చేసే దయనీయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది.

చేతికి రాని పీఎఫ్ నిధులు

ప్రతి ఉద్యోగికి భవిష్య నిధి ఉంటుంది. ఉద్యోగి జీతం నుంచి కట్ చేసుకున్న మొత్తానికి సరిపడా నిధులను ప్రభుత్వం కూడా జమ చేయాలి. ఆ జీపీఎఫ్ లో ఉన్న నిధులను అత్యవసర సమయాల్లో ప్రతి ఉద్యోగి వాడుకుందామని అనుకుంటాడు. అయితే, ఆ నిధులనూ ప్రభుత్వం దారిమళ్లించినట్లు ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు. నెలల తరబడి పీఎఫ్ నిధులను ప్రభుత్వం జమ చేయడం లేదని అంటున్నారు. ఈ విషయంపై ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు.

బాత్రూంల దగ్గర నిలబడి ఫోటోలా..

ఫేస్ అటెండన్స్, ప్రతి వారం బాత్రూంల దగ్గర నిలబడి ఫోటో దిగి అప్లోడ్ చేయడం వంటి తమకు అప్పజెప్పడం ఏంటని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సర్వర్లు పనిచేయ ఫెస్ అటెండెన్స్ పడకపోతే ఆ రోజు పనిచేయనట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమను వేధించడంమాని సరైన సమయానికి జీతం పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.