CINEMAUncategorized

‘రైటర్ పద్మభూషణ్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..

డిఫ‌రెంట్ మూవీస్‌, వెబ్ సిరీస్‌లు, షోల‌ను ప‌లు భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న ఓటీటీ మాధ‌మ్యం జీ 5.  బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను నిరంతంర అందుబాటులో ఉంచింది. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం, అలాగే అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి లాస‌ర్ 2, బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ‘గాలి వాన‌’, ‘రేసీ’, హ‌ల్ వ‌ర‌ల్డ్ మా నీళ్ల ట్యాంక్, అహ నా పెళ్లంట, రీసెంట్‌గా ఏటీఎం, ‘పులి – మేక’ అనే మ‌రో ఒరిజిన‌ల్‌..ఇలా అన్‌లిమెటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ప్రేక్ష‌కుల సొంతం. ఈ వ‌రుస‌లోకి మ‌రో సినిమా జాయిన్ అవుతుంది అదే ‘రైటర్ పద్మభూషణ్’.

రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్ చిత్రం మార్చి 17 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. మ‌హిళ‌ల గొప్ప‌తనాన్ని చాటిన ఈ సినిమాను స్ట్రీమింగ్ డేట్‌ను మ‌హిళా దినోత్స‌వం రోజునే జీ 5 ప్ర‌క‌టించ‌టం విశేషం. కమెడియన్‌గా, కీల‌క పాత్ర‌ధారిగా ఎన్నో సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సుహాస్ క‌ల‌ర్ ఫొటోతో హీరోగా మారి హిట్ కొట్టారు. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన మ‌రో చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’.

రైట‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటున్న యువ‌కుడు.. త‌న మ‌ర‌దలితో ప్రేమ‌లో ప‌డతాడు. వారికి పెళ్లి కుదురుతుంది. అంత‌లోనే మ‌రో వ్య‌క్తి ఆ అబ్బాయి పేరు మీద‌ ర‌చ‌న‌లు చేస్తుంటాడు. అదేవెర‌నేదే సినిమాలో ప్ర‌ధాన‌మైన అంశం. ఇటీవ‌ల థియేట‌ర్స్‌లో విడుద‌లైన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఓ వైపు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు మ‌ద‌ర్ సెంటిమెంట్ మిక్స్ అయిన‌ మంచి మెసేజ్‌ను ఒరియెంటెడ్ చిత్రంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అల‌రించిందీ చిత్రం.