AP

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం….

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఇవాళ్టితో12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది వైసీపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి. దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పూలమాలలతో అలంకరించారు. అటు తాడేపల్లి ఆఫీస్‌లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో సజ్జల రామకృష్ణ రెడ్డి, జోగి రమేష్, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మి పార్వతి, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్‌ చేసి పేదలకు బట్టలు పంచిపెట్టారు.

 

ప్రజల్లో మమేకమైన పార్టీ వైసీపీ అన్నారు సజ్జల. పార్టీలో జగన్‌తో పాటు అందరూ కార్యకర్తలే, ప్రజల ఆశయాలను అజెండాగా మార్చుకున్నాం అన్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాల కుట్రలు తిప్పికొట్టారు సజ్జల.

 

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ఆరోపణలపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల మధ్య మేం ఎప్పుడూ గ్రూపులు క్రియేట్‌ చేయలేదని, ఉద్యోగులతో రాజకీయాలు చేయలేదు, రాజకీయాలకు ఎప్పుడూ వాడుకోలేదని స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని భావించాము తప్ప వేరేగా భావించలేదన్నారు. ఉద్యోగుల కారణంగానే పథకాలు సక్రమంగా చేరుతున్నాయని, ఉపాధ్యాయులు కూడా సంతోషంగానే ఉన్నారన్నారు. అలాగే ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.