TELANGANA

టీఎస్‌పీఎస్సీ పరీక్ష రద్దుపై ఏఈ మరోసారి భేటీ..

పేపర్‌ లీక్‌ ఎపిసోడ్‌లో తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇవాళ సచలన నిర్ణయం తీసుకోనుంది. ఏఈ పరీక్ష రద్దుపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకోనున్న అధికారులు. పేపర్ లీక్ అయినట్లు తేల్చిన పోలీసులు.. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని ఇప్పటికే కమిషన్‌ చైర్మన్‌ బీ జనార్దన్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ యధాతథంగా ఉంటుందని వెల్లడించారు. సాక్ష్యాలు లేకుండా నిర్ణయాలు తీసుకోలేమన్నారు చైర్మన్. నమ్మిన వాళ్ళే గొంతు కోశారని ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నివేదిక ఆధారంగానే పరీక్షలపై తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు.

 

షెడ్యూల్‌ ప్రకారమే మే 5న గ్రూప్‌-1తోపాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇకపై జరుగబోయే అన్ని పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు సిద్ధంచేస్తామని చెప్పారు. పేపర్‌ లీకేజీపై అనవసరపు వదంతులు నమ్మొద్దని ఉద్యోగార్థులకు విజ్ఞప్తి చేశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతున్నదని, దీనివల్ల అభ్యర్థులు గందరగోళంలో పడే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.