AP

తిరుమలలో భక్తులకు రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు….

తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. రాబోయే వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్ధం అలిపిరి మార్గంలో 10వేలు,శ్రీవారీ మెట్టు మార్గంలో 5వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తాం..రాబోవు మూడు నెలలు పాటు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం వుంది..వేసవి రద్దీ నేపథ్యంలో మూడు నెలలు పాటు ప్రజాప్రతినిధులు సిపారస్సు లేఖలను జారీ చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

 

తిరుమల కొండ పై 40వేల మంది భక్తులకే మాత్రమే వసతి సౌకర్యం కల్పించే అవకాశం వుంది..80శాతం గదులను సామాన్య భక్తులకు కేటాయిస్తాం.. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తాం..కల్యాణకట్టలను 24గంటలు భక్తులకీ అందుబాటులో వుంచుతాం అని వివరించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మరోవైపు భక్తుల రద్దీ కొనసాగుతోంది. 5 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 79,415 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు 28,454 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు అని టీటీడీ తెలిపింది.