అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేరు మార్చడాన్ని భారతదేశం తిర్కరించింది. తమవి కాని ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది. అయితే చైనా కుయుక్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్.. అరుణాచల్ ఎప్పటికీ తమ అంతర్భాగమేనని స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్‌పై తన వాదనను పునరుద్ఘాటించే ప్రయత్నాల్లో భాగంగా చైనా నిన్న 11 ప్రదేశాలకు కొత్త పేర్లను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను జంగ్నాన్‌గా పిలుస్తున్న చైనా.. “టిబెట్ యొక్క దక్షిణ భాగం జాంగ్నాన్” అని పేరు పెట్టింది. అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది మూడోసారి. చైనా విడుదల చేసిన పేర్ల జాబితాలో ఐదు పర్వత శిఖరాలు, రెండు భూభాగాలు, రెండు నివాస ప్రాంతాలు, రెండు నదులు ఉన్నాయి. ఇప్పటికే అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలకు 2 సార్లు పేర్లు పెట్టింది. 2017లో ఆరు పేర్లతో కూడిన జాబితాను చైనా విడుదల చేయగా, 2021లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 స్థలాలను పేరుమార్చింది.ఇప్పుడు మళ్లీ 11 ప్రాంతాలకు పేర్లు పెట్టింది.