పార్వతీపురం, మన్యం జిల్లా :
కొమరాడ మండలం, సర్వపాడు గ్రామంలో గోడ కూలి గిరిజన కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాటుకే.కృష్ణమూర్తి మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మనకు తెలిసిందే. దీనిలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న కే.కృష్ణమూర్తి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 5000, క్షతగాత్రుల కుటుంబాలకు మూడు బియ్యం ప్యాకెట్లు గ్రామ పెద్దలు సమక్షంలో అందజేసి వారిని ఆదుకున్నారు. ఈ సందర్భంగా చిన్న కేర్జల పంచాయతి ప్రెసిడెంట్ బిడ్డిక గంగాధర్ , సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి పోలీస్ కృష్ణమూర్తికి ధన్యవాదాలు తెలిపి మాట్లాడారు. కృష్ణమూర్తి ప్రతినెలా తన జీతంలో కొంత భాగాన్ని అభాగ్యులను అనాధలను ఆదుకునేందుకు కేటాయించి సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఆయన సేవలు నిస్వార్ధమైనవని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టేందుకు భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆరోగ్యం ప్రసాదించాలని కోరారు.