National

బెంగళూరులో కుప్పకూలుతున్న విద్యుత్ స్థంభాలు, కాలిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు !

బెంగళూరు: బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, భారీ గాలుల దెబ్బకు పెద్దపెద్ద చెట్లతో పాటు విద్యుత్ స్థంభాలు నేలమట్టం అవుతున్నాయి.

బెంగళూరు సిటీ పరిధిలో బెస్కామ్ కు చెందిన సుమారు 540 విద్యుత్ స్థంభాలు కుప్పకూలడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

12 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి, ఏం చెప్పారంటే !

బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు, గాలులకు బీబీఎంపీ పరిధిలో చాలా చెట్లు కుప్పకూలి విద్యుత్ స్థంభాల మీద పడ్డాయి. భారీ చెట్లు విద్యుత్ స్థంభాల మీదపడటంతో బెస్కామ్ కు చెందిన విద్యుత్ స్థంభాల వైర్లు తెగిపోయి కింద కుప్పకూలిపోవడంతో విద్యత్ సరఫరా ఆగిపోయంది.

భారీ వర్షాల దెబ్బకు బీబీఎంపీ పరిధిలో బెస్కామ్ కు చెందిన 140 విద్యుత్ స్థంభాలు పూర్తిగా విరిగిపోయాయి. బెంగళూరులో సోమవారం సాయంత్రం వరకు సుమారు 540 విద్యుత్ స్థంభాలు కూలిపోయాయని, పలు చోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, మరమత్తులు చేసి వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా చేస్తామని బెస్కామ్ అధికారులు అంటున్నారు.

 

ఎంపీ సుమలత కొడుకు పెళ్లి ఫిక్స్, పెళ్లికి వస్తున్న ప్రధాని మోదీ ?, సీఎం, చిరంజీవి !

540 విద్యుత్ స్థంభాలతో పాటు 40కి పైగా ట్రాన్స్ ఫార్మర్లు పూర్తిగా కాలిపోయాయని అధికారులు అంటున్నారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్లు బిగించి త్వరలో విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, అంత వరకు ప్రజలు సహకరించాలని బెస్కామ్ అధికారులు అంటున్నారు. మొత్తం మీద భారీ వర్షాల దెబ్బలకు బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లోని చెట్లు, విద్యుత్ స్థంభాలు కుప్పకూలిపోతున్నాయి. అయితే విద్యుత్ స్థంభాలు కూలిపోవడం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బెస్కామ్ అధికారులు అంటున్నారు.