దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి జోష్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు సానుకూలంగా ఉండంతోపాటు కొన్ని ప్రధానమైన రంగాల్లో కొనుగోళ్ల వల్ల భారీ లాభాల వైపు దూసుకెళ్తున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ సెన్సెక్స్ సూచీ 361 పాయింట్ల లాభంతో 63 వేల 90 మార్క్ వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 108 పాయింట్లు లాభపడి 18 వేల 709 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా, ఎస్ బీఐ, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో మూడు కంపెనీల షేర్లు మాత్రం దూసుకువెళుతున్నాయి. పెట్టుబడిదారులకు మంచి లాభాలనందిస్తూ టాప్ ట్రెండింగ్ లో నిలిచాయి. వాటిగురించి తెలుసుకుందాం..
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel) : ట్రేడింగ్ ప్రారంభమైన కొంచెం సేపటికే 2 శాతం పెరిగింది. ఈ కంపెనీ ఇనుప గనులు దక్కించుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా షేర్లు రాణిస్తున్నాయి.