ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో మాత్రం పరిస్థితి దారుణంగా మారిందని చెప్పాలి.. భారీగా కురిసిన వర్షాలకు వరదలు ఎక్కువగా వస్తున్నాయి..
భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 75 ఏండ్లలో ఎన్నడూలేనంతగా వానలు కురవడంతో రాష్ట్రం వణిపోయింది. వరదలు పోటెత్తడంతో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. సుమారు వందకు పైగా మరణించారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 వేల కోట్ల మేర నష్టం వాటిళ్లిందని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు వెల్లడించారు..
ఈ వరదలు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయని దాంతో కేంద్ర ప్రభుత్వం మాకు ఆర్థిక సాయం అందించాలని ఆయన తెలిపారు..2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విపత్తు నిధులు రూ.315 కోట్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశామన్నారు. వర్షాలు, వరదలతో రూ.8 వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనావేశామని స్పష్టం చేశారు.. కులు జిల్లాలోని కసోల్, మణికరణ్ మరియు ఇతర పరిసర ప్రాంతాలలో చిక్కుకున్న కొంతమంది పర్యాటకులు తమ వాహనాలు లేకుండా బయటకు వెళ్లడానికి నిరాకరించారు. పరిస్థితి సాధారణీకరించి, అన్ని రహదారులు తెరిచే వరకు వారంతా మరికొన్ని రోజులు వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు.కసోల్-భుంటార్ రహదారిపై దున్ఖారా సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో అనేక వాహనాలు కదలలేదు మరియు పర్యాటకులు అవతలి వైపుకు చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయవలసి వచ్చింది. అయితే, ఈ పర్యాటకులను జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఇకపోతే సాధ్యామైన త్వరగా రోడ్లు, విద్యుత్, నీటి సరఫరాను కొంతవరకు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత ఆపత్కాలంలో కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సన్నద్ధమై ఉందని చెప్పారు. ప్రజల ప్రాణాలు రక్షించడానికే అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. విపత్తు వేళ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఇబ్బందులు ఆయనకు తమాషా గా ఉందని తీవ్రంగా మండిపడ్డారు..