National

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కావేరి జలాల కోసం పోరాటం ఉధృతం

బెంగళూరు: కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కావేరి జలాల కోసం పోరాటం ఉధృతంగా మారింది. సెప్టెంబర్ 26 వతేదీన బెంగళూరు బంద్ జరిగింది. రెండు రోజుల గ్యాప్ తో సెప్టెంబర్ 29వ తేదీన కర్ణాటక బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలు మూసివేయబడ్డాయి.

ఐటీ (IT) కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవలసి ఉంటుంది. చాలా కంపెనీలు సగం మంది సిబ్బందితో పని చేయాల్సి వచ్చింది.

 

కర్ణాటక (Karnataka)బంద్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య లావాదేవీలు నిలిచిపోయాయి. ఇప్పటికే అనేక కారణాల వలన వాణిజ్య, పరిశ్రమల్లో కోట్లాది కోట్ల ఉద్యోగాలు పోయాయి. ప్రభుత్వ ఖజానాకు కూడా గండి పడింది. కర్ణాటక బంద్ వల్ల జరిగిన నష్టంపై ఎఫ్‌కేసీసీఐ అధ్యక్షుడు రమేష్‌చంద్ర లాహోటి మాట్లాడుతూ కర్ణాటక బంద్ కారణంగా వాణిజ్య లావాదేవీలు నిలిచిపోయి రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు.

అన్ని రకాల వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల నుంచి వసూలు కావలసిన రూ. 400 కోట్లకు పైగా పన్ను సొమ్ము ఒక్కరోజులోనే ఆవిరి అయ్యిందని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రంలో కావేరీ జలాల (water) పోరాటం కారణంగా జరిగిన కర్ణాటక బంద్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా (Karnataka)వర్తక, వాణిజ్య, పరిశ్రమలకు చెందిన 70 శాతం మంది వ్యాపారులు దీనికి మద్దతు ఇచ్చారు.

 

ఎఫ్ కేసీసీ కూడా ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. కర్ణాటక బంద్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ 400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, భూమి, భాష, నేల, నీరు (water) సమస్య వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలని, ఇలాంటి కాలంలో మనమందరం నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని ఎఫ్ కేసీసీ అధ్యక్షుడు రమేష్ చంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎఫ్ కేసీసీఐ అధ్యక్షుడు రమేష్ చంద్ర లాహోటి మాట్లాడుతూ కావేరీ నదీ జలాల (water)పంపిణీ వివాదాన్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. ఎఫ్ కేసీసీ (FKCCI) మాజీ అధ్యక్షుడు బీవీ. గోపాల్ రెడ్డి (Reddy) మాట్లాడుతూ సెప్టెంబర్ 26వ తేదీన జరిగిన బెంగళూరు బంద్ వల్ల రూ. 200 నుంచి 250 కోట్ల నష్టం వాటిల్లవచ్చని తెలిపారు. కర్ణాటక బంద్ వల్ల రాష్ట్రానికి రూ. 500 నుంచి రూ 600 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని బీవీ గోపాల్ రెడ్డి (Reddy) అన్నారు.

 

అనేక సంస్థలు కర్ణాటక (Karnataka) బంద్‌కు మద్దతు ఇవ్వడంతో ఓలా, ఉబర్ ట్యాక్సీ, క్యాబ్‌లు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బంద్ నేపథ్యంలో విమాన టికెట్ల బుకింగ్ అంతంత మాత్రంగానే ఉంది. కొందరు ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకున్నా విమానాశ్రయానికి వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో టిక్కెట్లను రద్దు చేసుకున్నారు.

బంద్ కారణంగా ఢిల్లీ, ముంబాయి, కోల్ కతా, మంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి బెంగళూరుకు (Bengaluru) వెళ్లే 44 విమానాలు నిలిచిపోయాయి. మొత్తం మీద బెంగళూరు బంద్, కర్ణాటక బంద్ కారణంగా ప్రభుత్వానికి సుమారు రూ 400 కోట్ల నుంచి రూ 500 కోట్ల వరకు నష్టం వచ్చింటుందని నిపుణులు అంచనా వేశారు.