National

తమిళనాడులో 31 ఏళ్ల నాటి ఓ సంచలన కేసులో మద్రాస్ హైకోర్టు హైకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వె

తమిళనాడులో 31 ఏళ్ల నాటి ఓ సంచలన కేసులో మద్రాస్ హైకోర్టు హైకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని వాచాతిలో 1992లో స్మగ్లింగ్ కోసం జరిపిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల్ని హైకోర్టు దోషులుగా నిర్ధారించింది.

వీరందరూ దాఖలు చేసుకున్న అప్పీళ్లను తిరస్కరించిన హైకోర్టు.. జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది.

తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంలో చందనం స్మగ్లింగ్ పేరుతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు కుమ్మక్కై జూన్ 20 1992న స్మగ్లింగ్ గంధపు చెక్కల కోసం వెతుకుతున్న గ్రామస్ధులపై దాడి చేశారు. ఈ దాడిలో ఆస్తి, పశువుల విధ్వంసంతో పాటు 18 మంది మహిళలపై అత్యాచారం చేశారు. దీనిపై 2011లో ధర్మపురిలోని సెషన్స్ కోర్టు నలుగురు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, 84 మంది పోలీసులు, ఐదుగురు రెవెన్యూ శాఖ అధికారులతో సహా 126 మంది అటవీ సిబ్బందిని దోషులుగా నిర్ధారించింది. 269 ​​మంది నిందితులలో 54 మంది విచారణ సమయంలో చనిపోయారు. మిగిలిన 215 మందికి 1 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది.

దీన్ని సవాల్ చేస్తూ వీరంతా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని అప్పీళ్లను కొట్టేయడంతో పాటు సెషన్స్ కోర్టు తీర్పును సమర్ధించింది. బాధితులు, ప్రాసిక్యూషన్ సాక్షులందరి సాక్ష్యాలు సమర్ధవంతంగా , స్థిరంగా ఉన్నాయని నమ్ముతున్నట్లు హైకోర్టు ప్రకటించింది. దీంతో ఈ 215 మంది అధికారులకు ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలుశిక్షలు ఖరారు చేస్తూ ఇవాళ సంచలన తీర్పు ప్రకటించింది.