National

మా కులం అధికారులకు ఇంత అన్యాయం చేస్తారా ?, సొంత పార్టీ లీడర్ తో సీఎం షాక్, అంతే !

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్ అధికారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాటలను కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప (yediyurappa) సమర్థించారు.

శామనూరు శివశంకరప్ప (congress) ప్రకటనను సమర్థిస్తున్నానని, రాష్ట్రంలో లింగాయత్ అధికారులను నిర్లక్ష్యం చేస్తున్నారని బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

కర్ణాటక ప్రభుత్వ అధికారుల్లో వీరశైవ లింగాయత్ అధికారులు అధిక సంఖ్యలో ఉన్నారని బీఎస్ యడియూరప్ప(yediyurappa) చెప్పడం ఇఫ్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కానీ కాంగ్రెస్ (congress) ప్రభుత్వం లింగాయత్ సంఘం అధికారులను పట్టించుకోవడం లేదని వీరశైవ మహాసభ జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప బహింగంగా మాట్లాడటం కలకలం రేపింది.

లింగాయత్ అధికారులకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని శామనారు శివశంకరప్ప (congress) అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లింగాయత్ అధికారులకు ఉన్నత పదవులు రావడం లేదని లింగాయత్ (BJP) కులానికి చెందిన పలు పార్టీల నాయకులు ఆరోపించడం ఇప్పుడు కర్ణాటకలో (karnataka) కలకలం రేపింది.

శామనూరు శివశంకరప్ప, బీఎస్ యడ్యూరప్ప (yediyurappa)ఆరోపించిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah) స్పందించారు. తమ ప్రభుత్వం సెక్యులర్ అని సీఎం సిద్దరామయ్య అన్నారు. కులం ఆధారంగా ఎవరికీ పదవులు ఇవ్వడం లేదని, రాజ్యాంగం ప్రకారం పనులు జరుగుతాయని, అన్నభాగ్య, శక్తి, గృహజ్యోతి, గృహలక్ష్మి వంటి మా పథకాలను కుల ప్రాతిపదికన ఎవ్వరికి ఇవ్వలేదని సీఎం సిద్దరామయ్య (siddaramaiah)అన్నారు.

సీఎం సిద్ధరామయ్య (siddaramaiah)మాటలను సమర్థించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (dk shivakumar) మాట్లాడుతూ కులం ఆధారంగా అధికారులకు పదవులు ఇవ్వలేమని అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల బాగోగులు చూడాలి. అందరినీ సమానంగా చూసేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య (siddaramaiah)కృషి చేస్తున్నారని డీకే శివకుమార్ తెలిపారు. శామనూరు శివశంకరప్ప వీరశైవ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా పని చేస్తున్న విషయం తెలిసిందే అని డీకే శివకుమార్ (dk shivakumar)గుర్తు చేశారు.

కేజీఎఫ్ చాప్టర్-3, హీరో, నిర్మాతలు, టీమ్ డీల్ సంచలనం, రిలీజ్ డేట్ ఫిక్స్ !

శామనూరు శివశంకరప్పకు సమాజంలో ఎంత స్థానం లభించిందన్న సమాచారం అందరికి తెలుసని డీకే శివకుమార్ (dk shivakumar)అన్నారు. అధికారులు సహజంగానే తమకు మంచి పోస్టు కావాలని ఆశిస్తారు. కానీ కులం (congress) ఆధారంగా పోస్టులు పెట్టలేమని, లింగాయత్ వర్గానికి నాయకుడు అయిన శామనూరుపై లింగాయత్ కులానికి చెందిన అధికారులు మాకు ఉన్నత పదవులు కావాలని ఒత్తిడి చేసి ఉంటారని, కొందరు అధికారులు ఆయన వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసి ఉండవచ్చని, ఇలా అడగడం తప్పుకాదని డీకే శివకుమార్ (dk shivakumar)అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా శామనూరు శివశంకరప్ప లింగాయత్ కులం అధికారుల అంశాన్ని లేవనెత్తి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. లింగాయత్‌లు ముఖ్యమంత్రులు అయినప్పుడల్లా (ఎస్ నిజలింగప్ప, బీఎస్ యడ్యూరప్ప (yediyurappa), బసవరాజ్ బోమ్మయ్) లింగాయత్ కమ్యూనిటీలోని అధికారిక వర్గం మంచి పదవులను పొందారు. కానీ సిద్ధరామయ్య ప్రభుత్వంలో అలా జరగడం లేదు. ఉపకులాల మధ్య ఐక్యత లేకపోవడమే (congress) ఇందుకు కారణమని కొందరు అంటున్నారు.