National

ఆవుపేడతో 3 లక్షల దీపాలు

రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు చెందిన శ్రీ కృష్ణ బలరామ్ గోసేవా ట్రస్టు ఈ దీపావళికి ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంది. హంగోనియా గోశాల నుంచి ఇందుకు అవసరమైన ఆవుపేడను సేకరించారు. జైపూర్ సమీపంలో ఈ గోసేవా ట్రస్టును రాజస్థాన్ ప్రభుత్వం, జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ 2016లో ఏర్పాటు చేసింది. 13,000 గోవులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. ఆవు పేడతో 3 లక్షల దీపాలు తయారు చేయడం వెనుక ఆవులను పరిరక్షించాలనే సందేశం ఉందని నిర్వాహకులు తెలిపారు.