సీఎం రేవంత్ రెడ్డి… అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన పాలన అందించడం తపిస్తూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన సీఎం…. ప్రజా దర్బార్ తో వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ను సులభతరం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే డిఎస్పీ నళిని ఉద్యోగంపై పోలీస్ ఉన్నాతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన డిఎస్సీ నళినికి…. యూనిఫామ్ సర్వీస్ కాకపోతే…. ఆమె ఇష్టానుసారం వేరే శాఖలో ఉద్యోగ అవకాశలను చూడాలని సీఎం రేవంత్ సూచించారు.
తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైద్య శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, వైద్య శాఖ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.