AP

జగన్ ఓకే చెబితేనే.. చంద్రబాబు వెయిటింగ్..

టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను పన్నుతున్నారు. ఈసారి విజయం కీలకం కావడంతో ప్రతి అడుగు ఆచీతూచీ వేస్తున్నారు. తప్పటడుగులు వేస్తే మూల్యం తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ తో చేతులు కలిపారు. జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు. జగన్ కు గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. అయితే జగన్ ఆ అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి. అయితే ఏ చిన్న అవకాశం ఇచ్చిన చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో దానిని అవకాశం గా మలుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

 

More

From Ap politics

ఇటీవల చంద్రబాబు శరవేగంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ కు సలహాలు, సూచనలు అందించడంతో పాటు వ్యూహాల రూపొందించిన ప్రశాంత్ కిషోర్ ను తన వద్దకు తెప్పించుకున్నారు.గత ఎన్నికల ముందు జగన్ వద్ద ఉన్న వనరులు సమకూర్చుకోవడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. టిడిపిలోకి భారీగా చేరికలను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. అధికార పార్టీపై ఏమాత్రం అసంతృప్తి ఉన్నా వారిని ఆకర్షించే పనిలో పడ్డారు. ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఆకర్షించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవి తదితరులు టిడిపి గూటికి చేరారు.

 

తాజాగా వైసీపీ అభ్యర్థుల మార్పుతో అధికార పార్టీలో ఒక రకమైన గందరగోళం నెలకొంది. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అభ్యర్థులను జగన్ మార్చారు. ఈ జాబితాలో సీనియర్లు, సొంత మనసులు ఉండడం విశేషం. ఈ 11 మందితో మార్పు ఆగదని.. రాష్ట్రవ్యాప్తంగా 80 మందికి పైగా సిట్టింగులను జగన్ మార్చుతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పార్టీలో దిక్కర స్వరాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్ నడుస్తోంది. దాదాపు 13 జిల్లాల్లో ఈ మార్పులు ఉంటాయని సమాచారం. అదే జరిగితే ప్రత్యామ్నాయాలను వెతుక్కుని చాలామంది నాయకులు పక్క పార్టీల్లోకి వెళ్లడం ఖాయం. అందుకే ఇటీవల చంద్రబాబు దూకుడు పెంచారు. తమతో 20 మందికి పైగా వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు ప్రకటించారు.ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది.

 

అయితే వైసీపీలో అభ్యర్థుల ఎంపిక త్వరితగతిన జరుగుతున్నా.. టిడిపిలో ఆ స్థాయిలో దూకుడు లేదు. అయితే దీనికి జగనే కారణం. ఆయన రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చిన తరువాతే టిడిపి జాబితాను ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అప్పుడే అధికార పార్టీ నుండి భారీగా చేరికలలకు అవకాశం ఉంటుంది. ఇంతలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆకర్షిస్తే ఒక ఊపు వస్తుందని.. జగన్ అభ్యర్థులను మార్చిన తర్వాత.. బాధితులు టిడిపి వైపు వస్తారని.. అప్పుడు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఎదిరించే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. అందుకే జగన్ ను చూసి ఒక అడుగు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.