AP

షర్మిల గిఫ్ట్.. లోకేష్ కామెంట్స్..

రాజకీయాలన్నాకా ఏవైనా జరుగుతాయి. ఇందులో తర్కం వెతుక్కోకూడదు. అందుకే కదా స్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదనేది. ఫర్ సపోజ్ ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు.. అతడు జైల్లో ఉన్నప్పుడు.. అతని సోదరి షర్మిల పాదయాత్ర చేసింది. ఏపీలో పార్టీని బతికించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదు. పైగా ఆమె తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చింది.. ఆంధ్రలో కాదనుకొని తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానని వై యస్ ఆర్ టీ పీ ని ఏర్పాటు చేసింది. పాదాలతో నడిచే యాత్రను ప్రారంభించింది. అంతేకాదు పాలేరులో పోటీ చేస్తానని ప్రకటించింది..సీన్ కట్ చేస్తే అసలు ఆమె ఎన్నికల్లో సోయిలోనే లేకుండా పోయింది. కర్ణాటక నుంచి ఆమెకు రాజ్యసభ స్థానం ఇస్తారని వచ్చిన వార్తలకు కూడా విలువ లేకుండా పోయింది. సడన్ గా అలాంటి షర్మిల టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది. సరే ఆ గిఫ్ట్ లో ఏముంది అనేది పక్కన పెడితే.. గిఫ్ట్ పంపించిన షర్మిల తన పేరు షర్మిల గారు అని రాసుకుంది. ఇది ఒకింత అనుమానమే అయినప్పటికీ ఇది నేను పంపాను అని షర్మిల చెప్పలేదు. అందులో ఏముంది అనేది లోకేష్ వివరించలేడు.కానీ అది మొత్తానికి మీడియాలో పెద్ద హాట్ టాపిక్. రాంగోపాల్ వర్మ జగన్ కి ఫేవర్ గ తీస్తున్న వ్యూహానికి జెల్ల కొట్టే ప్రయత్నం అది. క్రిస్మస్ పండుగ పూర్తయి ఒకరోజు గడిచినప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఈ గిఫ్ట్ గురించే చర్చ జరుగుతోంది అంటే మామూలు విషయం కాదు.

 

More

From Ap politics

ఇక ఆ గిఫ్ట్ గురించి కొంత సేపు పక్కన పెడితే ఇటీవల ప్రముఖ జర్నలిస్టు జాఫర్ నారా లోకేష్ తో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇస్తారా? అనే ప్రశ్నలు అడిగితే నారా లోకేష్ రెండవ మాటకు తావు లేకుండా నారా చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి, అనుభవానికే పెద్ద పీఠ వేస్తామని ఆయన ప్రకటించారు. మరి ఇదే టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పదేపదే ట్రోల్ చేసింది. మరి తెలంగాణలో మార్పు కావాలి అనుకున్నప్పుడు.. ఆంధ్రలో అదే మార్పును ఎందుకు స్వీకరించకూడదు? పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సహకరించని ఆరోగ్యం.. ప్రజా పరిపాలనకు ఎందుకు పనికొస్తుంది? ఇదే ప్రశ్నలను జాఫర్ సంధించలేదు. వీటికి లోకేష్ సమాధానం చెప్పలేడు.

 

ఇక లోకేష్ చేసిన వ్యాఖ్యలతో జనసేన పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.. కొంతమంది నాయకులు రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లిపోయారు. కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నాళ్లు జండా మోసే కూలీలుగా ఉండాలంటూ ఆవేదన వెలిబుచ్చారు. సాధారణంగా లోకేష్ చేసిన కామెంట్లు టిడిపి శిబిరంలో సంతోషాన్ని కలిగిస్తే.. జనసేన శిబిరంలో మాత్రం ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అయితే సాధారణంగా ఇలాంటి పరిణామాలు ఎన్నికలకు ముందు ఒకింత వేడి వాతావరణాన్ని రాజేస్తాయి. ఇలాంటి వాటి వల్ల జనాల మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. ఇక్కడిదాకా ఎందుకు 2019 ఎన్నికల్లో జగన్ మీద కోడి కత్తి దాడి జరిగిన తర్వాత, జగన్ బాబాయ్ చనిపోయిన తర్వాత పూర్తిగా ఎన్నికల స్వరూపమే మారిపోయింది. టిడిపిపై ప్రజాగ్రహం తారస్థాయిలో వ్యక్తం అయింది. అంటే వీటి ప్రకారం రాజకీయాలంటే ఇలానే ఉండాలని లేదు. ఇలా ఉంటేనే రాజకీయాలు అనడానికి కూడా లేదు. ప్రస్తుతం షర్మిల పంపించిన గిఫ్ట్, లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ తరహాలో లోనివే. రాంగోపాల్ వర్మ వ్యూహం, ఆడుదాం ఆంధ్ర, ఉద్దానం లో నిర్మించిన ఆసుపత్రి, నీటి శుద్ధి కేంద్రాలు అన్ని పక్కకు వెళ్లిపోయాయి. అంటే ఇవన్నీ జనం దృష్టి నుంచి దూరంగా వెళ్లిపోయాయి అంటే వారి మైండ్ సెట్ మార్చే ప్రయత్నం విజయవంతమైనదని లెక్క. మరి దీన్ని తుది వరకు టిడిపి కాపాడుకోగలుగుతుందా అనేది తేలాల్సి ఉంది. ఇది జుట్టు పీక్కునే పీకే స్ట్రాటజీ.. అందుకే కదా ఆ బీహార్ డెకాయిట్ ను చంద్రబాబు నాయుడు ఏరి కోరి తీసుకొచ్చుకుంది.