TELANGANA

బీఆర్ఎస్ భవన్‍కు రెవెన్యూ శాఖ నోటీసులు….

బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజరాహిల్స్ లోని బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ అధికారులు నోటీసీలు జారీ చేశారు. పార్టీ ఆఫీస్ లో నిబంధనలకు విరుద్దంగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నోటీసులో పేర్కొంది. పార్టీ కార్యాలయంలో కొనసాగుతోన్న టీవీ ఛానెల్ ను మరో చోటికి మార్చుకోవాలని స్పష్టం చేసింది. న్యూస్ ఛానెల్ ఎప్పటిలోగా ఖాలీ చెస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

 

ఈ మేరకు తెలంగాణ భవన్ ఇన్ ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. పార్టీ వ్యవహారాలకు సంబంధించిన ఆఫీసులో 2011 నుంచి టీవీ ఛానల్ వ్యవహారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ ఛానెల్ ను మరో భవనానికి షిప్ట్ చేసే ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టింది.

 

ఇంతలోనే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు పంపారు. ఈ నోటీసులపై తెలంగాణ భవన్ కు చెందిన వారు మీడియాకు వివరణ ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పటికే పలువు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయన భార్య పేరుపై ఆర్మూర్ ఆర్టీసీ స్థలాన్ని లీజ్ కు తీసుకున్నారు. ఆ తర్వాత అద్దె చెల్లించలేదు. అలాగే కరెంట్ బిల్లు కూడా చెల్లించలేదు.

 

దీంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆలాగే జీవన్ రెడ్డి ఆయన భార్య పేరుపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో లోన్ తీసుకుని వడ్డీ, అసలు కట్టలేదు. దీంతై వారు కూడా నోటీసులు జారీ చేశారు. అలాగే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కూడా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆయన ఎస్టీల భూములు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి.