TELANGANA

రేపు కోయంబత్తూరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కోయంబత్తూరు పర్యటనకు వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొనే ప్రతిష్ఠాత్మకమైన 10వ ఎఫ్‌ఎంఏఈ-నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరగనుంది.

 

ఈ విషయాన్ని బీఆర్ఎస్ తన అధికారిక సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించే ఈ జాతీయ పోటీలకు కేటీఆర్ హాజరవుతుండడం గర్వకారణమని పేర్కొంది. యువతలో ఆవిష్కరణా దృక్పథం, సాంకేతిక ప్రోత్సాహం, మోటార్‌స్పోర్ట్స్‌ రంగంలో కొత్త ప్రతిభను వెలికితీసే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని తెలిపింది.