ఈ రోజు ఉదయం బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారని కొన్ని ఛానల్స్ లో వార్తలు రావడం జరిగింది.
వాస్తవానికి అటువంటిది ఏమీ జరగలేదు. బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గారిని పోలీసులు ఎటువంటి హౌస్ అరెస్ట్ చేయలేదు. దేవాలయ కార్యనిర్వాహణ అధికారి (EO) గారు తేరు వద్దకు నాయకులు అందరూ ఒకే సమయంలో వస్తే ఇబ్బందులు ఉంటాయని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోమని సమాచారం ఇవ్వడంతో వారి సూచనల మేరకు పోలీసులు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గారిని వారి ఇంటి వద్ద కలిసి వారి దర్శన సమయమును మార్చుకోమని, అందుకు అనుగుణంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వామివారిని దర్శించుకోవచ్చునని పోలీసులకు సహకరించమని తెలియజేయడము జరిగింది తప్ప వారిని ఎటువంటి హౌస్ అరెస్ట్ చేయలేదు.
పత్రికా, మీడియా సహోదరులు అందరూ కూడా ఈ విషయమును గమనించవలసిందిగా తెలియజేయడమైనది.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
కదిరి టౌన్ పిఎస్

