AP

పుట్టపర్తి విమానాశ్రయంలో గవర్నర్‌కు ఘన స్వాగతం: మర్యాదపూర్వక భేటీ

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ (జేసీ), జిల్లా ఎస్పీ మరియు ఆర్డీవో తదితర అధికారులు గవర్నర్‌ను మర్యాదపూర్వకగా కలిసి పూల బొకేలను అందజేశారు. అధికారులు గవర్నర్‌కు సాదరంగా ఆహ్వానం పలుకుతూ, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం.

ఈ మర్యాదపూర్వక భేటీ అనంతరం గవర్నర్ అధికారులతో కలిసి తన పర్యటనలో భాగంగా నిర్ణయించుకున్న తదుపరి కార్యక్రమాలకు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు మరియు రెవెన్యూ విభాగం సిబ్బంది ఈ స్వాగత కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.