ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించింది. దీంతో కమిటీతో TGSRTC జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి RTC ఉద్యోగులు సమ్మెలోకి దిగనన్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంకోసం ప్రభుత్వం కమిటీ 4 వారాల సమయం కోరింది. దీంతో అందుకు ఆర్టీసీ జేఏసీ సంఘం అంగీకరించలేదు. కాగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చర్చలు విఫలం కావడంతో నేటి రాత్రి నుండే సమ్మే ప్రారంభింస్తామని ఆర్టీసీ జేఎసీ ఉద్యోగుల సంఘ అధికారులు తెలిపారు.
జీవో జారీ..!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మరియు ఇతర పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు నెం.66 జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు తమ సర్వీసు నిబంధనలు, ఇతర వృత్తిపరమైన ఇబ్బందులపై ప్రభుత్వానికి పలుమార్లు వినతులు సమర్పించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్..
అటు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపినప్పటికి నిర్ణయం తీసుకోవడంతో అటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగనున్నాయి.

