సీయం రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుండి కొండా సురేఖ బర్తరప్ అవుతుందా లేదా అన్న అనుమానాలకి ఎండ్ కార్డ్ వేస్తూ ఎట్టకేలకి కొండా సురేఖని బర్తరప్ చేస్తూ AICC కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రస్తుతం కొండా సురేఖ వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే విషయం పై కొండా సురేఖ మాట్లాడుతూ తనకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తనని క్యాబినెట్ నుండి తప్పించారంటూ వాపోయారు.
పార్టీ పంపిన షోకాజ్ నోటీస్ లకి ఇప్పటికే తన వివరణ ఇచ్చానని, అయినప్పటికీ తన అభిప్రాయాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే, తనతో మాట్లాడకుండానే ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుకోవడం ఏ మాత్రం సరైనది కాదంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ జరుగుతున్న మొత్తం వివాదానికి కారణం రేవంత్ రెడ్డి పరకాలలో మళ్ళీ రేవూరిప్రకాష్ రెడ్డినే మళ్ళీ గెలిపించాలని అనడమే తేల్చి చెప్పింది. సీయం అలా అన్నాడు కాబట్టే తన కూతురు కొండా సుస్మితా పటేల్ అలా రియాక్ట్ అయిందని, అయినా తన కూతురు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అని, తను తన అభిప్రాయాన్ని చెబితే వాటికి తానెందుకు బాధ్యత వహిస్తానని, పిల్లలు ఎలా ఉండాలి,ఏం మాట్లాడాలి అనే ప్రతీ విషయంపై ఆదేశించలేమని స్పష్టం చేశారు.
ఇక ఇదే క్రమంలో కుటుంబ రాజకీయాలపై కొండా మాట్లాడుతూ గతంలో డీఎస్ కుటుంబంలో అరవింద్ బిజెపిలోకి వెళ్లిన విషయాన్ని, అలాగే కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్న విషయాలని గుర్తు చేశారు. “నేను పదేళ్లుగా నా కూతురు రాజకీయాల్లోకి తీసుకురావాలని తన వంతు ప్రయత్నం చేస్తున్నాని,కాని మొన్న మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి మాత్రం తన కూతురిని వరంగల్ MPగా చేసుకున్నాడని మనసులోని బాధని బయటపెట్టింది.మొత్తంగా వేర్వేరు కుటుంబాలలో ఇద్దరిద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నారని,వారికి ఒక న్యాయం నాకొక న్యాయం ఏంటన్నది ఆమె వేస్తున్న ప్రశ్న అని మాట్లాడిన మాటలు బట్టి అర్థమవుతుంది.
మరోవైపు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండించారు కొండా సురేఖ.ఇన్నేళ్ళ తన రాజకీయ జీవితంలో తానూ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ఆధారాలు లేకుండా తనపై మచ్చ వేసే ప్రయత్నం చేయడం సరికాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సురేఖ స్పష్టం చేశారు. పార్టీ వీడటం లేదా వేరే దారి చూసుకోవడం వంటి ఆలోచనలు ఏమీ చేయలేదని, అసలు ముందు ముందు ఏం చేయాలి అనే దానిపై తన భర్త కొండా మురళితో కలిసి చర్చించిన తర్వాతే నిర్ణయిస్తామని చెప్పారు.
సమాచారం లేకుండా బర్తరఫ్ చేశారనే అసంతృప్తి ఒకవైపు ఉన్నా, ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఆలోచన లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అధిష్ఠానం సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. చూడాలి ముందు ముందు కొండా వారి రాజకీయం ఎన్ని మలుపులు తీసుకోనుందో !

