AP

ఏపీకి మరో భారీ తుఫాన్ ముప్పు..!

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది వాయవ్య దిశగా పయనించి  సుస్పష్టమైన అల్పపీడనంగా, ఎల్లుండి ఉదయానికి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఆతదుపరి ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ  సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆదివారం నుంచి సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి తిరిగి రావాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు –కోస్తాంధ్ర తీరాల వైపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.