Health

ఈ ఒక్క చిట్కాతో నరాల బలహీనత మాయం..

మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే చాలా మంది రక్తనాళాలను, నరాలను ఒకటే అని అనుకుంటారు. కానీ రక్తనాళాలు వేరు. నరాలు వేరు. రక్తనాళాల ద్వారా రక్తం అవయవాలకు చేరవేయబడుతుంది. నరాలు సంకేతాలను చేరవేస్తాయి. మెదడు నుండి వచ్చిన సంకేతాలను నరాలు వెన్నుపాము ద్వారా చేతులకు, కాళ్లకు ఇతర అవయవాలకు చేరవేస్తాయి. అలాగే ఇతర అవయవాల నుండి వచ్చిన సంకేతాలను వెన్నుపాము గుండా మెదడుకు చేరవేస్తాయి. ఉదాహరణకు వేడి వస్తువును తాకినప్పుడు చేతికి కలిగిన బాధను నరాలు మెదడుకు చేరవేస్తాయి.

అలాగే చేయిని దూరంగా జరపాలని మెదడు నుండి, వెన్నుపాము నుండి వచ్చిన సంకేతాలను నరాలు చేతికి అందజేస్తాయి. నరాల కణాల ఆయుర్దార్థం జీవితకాలంగా ఉంటుంది. అదే విధంగా వెన్నుపాములో ఉండే నరాలు ప్రత్యేక నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఒకసారి తెగితే మరలా అత్తుకోవు. వెన్నుపాములో ఉండే నరాలు తెగితే కాళ్లు, చేతులు పని చేయకుండా పోతాయి. అలాగే చేతుల దగ్గర, కాళ్ల దగ్గర ఉండే నరాలు 3 ఎమ్ ఎమ్ కంటే ఎక్కువ లోతుగా తెగితే అత్తుకోవు. మన శరీరంలో ముఖ్య పాత్రమ పోషించే నరాలు బలహీనంగ అవ్వడానికి వివిధ కారణాలు ఉంటాయి. షుగర్ వ్యాధి వచ్చిన వారిలో నరాలు బలహీనంగా తయారవుతాయి.

Narala Balaheenatha సూక్ష్మమైన రక్తనాళాల ద్వారా నరాల కణాలకు రక్తం సరఫరా అవుతుంది. రక్తంలో చక్కెర ఎక్కువవడం వల్ల సూక్ష్మమైన రక్తనాళాలు దెబ్బ తింటాయి. దీంతో నరాల కణాలకు రక్త సరఫగా సరిగ్గా జరగక నరాలు బలహీనంగా తయారవుతాయి. షుగర్ వ్యాధి గ్రస్తుల్లో నరాలల్లో మంటలు పుట్టడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ధూమపానం, మద్యపానం చేసే వారిలో కూడా నరాలు బలహీనంగా తయారవుతాయి. ఈ నరాల బలహీనత సమస్య నుండి బయటపడాలంటే మన శరీరానికి విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ బి12 చాలా అవసరం. బియ్యాన్ని పాలిష్ పట్టగా వచ్చిన తవుడులో బి కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

ఈ తవుడును తీసుకోవడం వల్ల మనం నరాల బలహీనత సమస్య నుండి బయటపడవచ్చు. అదే విధంగా పుట్ట గొడుగులను, పాలకూర తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత బి 12 విటమిన్ లభిస్తుంది. వీటితో పాటు ఈ సమస్య ఉన్న వారు మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకోవాలి. ఈ సమస్య ఉన్న వారు ధూమపానానికి, మద్య పానానికి దూరంగా ఉండాలి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మనం నరాల బలహీనత సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.