CINEMA

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కలయికలో హ్యాట్రిక్ మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించే అవకాశాలు ఉన్నాయి. దసరా పండుగకు ముందే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబో చిత్రంపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబుతో తను తీయబోయే సినిమా ఇండియన్ జోనర్ లో యాక్షన్ అడ్వెంచర్(action adventure) అని ఇప్పటికే రాజమౌళి వెల్లడించారు. దీంతో వీరి కాంబో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోతున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు రాజమౌళికి ఏకంగా 250 డేట్స్ ఇచ్చాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మహేష్ ఇన్ని రోజులు ఏ సినిమాకు కేటాయించిన దాఖలాలు లేవు. కానీ కెరియర్ లో తొలిసారి రాజమౌళి సినిమా కోసం మహేష్ అన్ని డేట్స్ ను కేటాయించాడని టాక్‌ నడుస్తోంది. అంతేకాదు రాజమౌళితో సినిమా చేస్తున్నన్ని రోజులు మహేష్ మరే ప్రాజెక్టుకు కమిట్ అవ్వకూడదని కూడా డిసైడ్ అయ్యారట.