టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అరుదైన రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈయన ఒకవైపు రాజకీయాలు.. మరొకవైపు సినిమాలు.. ఇంకొకవైపు బుల్లితెర షోలు అంటూ ఆరు పదుల వయసులో కూడా అలుపెరగని రీతిలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈయన వారసులు నందమూరి హరికృష్ణ తనయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకొని.. తాతకు తగ్గ మనవడిగా చలామణి అవుతున్నారు. ఇప్పటికే ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్.. పలు బుల్లితెర షోలకి కూడా హోస్ట్ గా వ్యవహరించి మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా బాలకృష్ణ , ఎన్టీఆర్ కలసి ఒక సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్ లో బాలకృష్ణ చేయాల్సి ఉంది. కానీ కొరటాల శివ అడిగినా సరే కొన్ని కారణాలవల్ల గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట బాలయ్య.
దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఆగిపోయింది. అయితే మళ్లీ వీరిద్దరూ ఒక సినిమా చేయాలని అనుకున్నా ఇద్దరి మధ్య మాటలు లేని కారణంగా దర్శకులు వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి ఎంత ప్రయత్నం చేసినా.. వీరు మాత్రం అంగీకరించడం లేదు. కానీ ఎట్టకేలకు ఆయన కోసం ఎన్టీఆర్ దిగివచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ త్వరలో బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో భాగం కాబోతున్నారట. బాబాయ్ బాలకృష్ణ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని సమాచారం. గత కొంతకాలం నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్ మద్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకే వీరిద్దరూ కలిసి నటించడం లేదు అని సమాచారం. కానీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిక్వెస్ట్ మేరకు ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా కనీసం ఏ సినిమాతో నైనా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.