Technology

అగ్నివీర్​ ఎస్​ఎస్​ఆర్​ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ

1400 అగ్నివీర్​ ఎస్​ఎస్​ఆర్​ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ! కేవలం ఆన్​లైన్​లోనే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్​లైన్​లో దరఖాస్తులను ఇండియన్​ నేవీ స్వీకరించడం లేదు. ఆన్​లైన్​ అప్లికేషన్​ ఫామ్​ అందుబాటులోకి వచ్చిన తేదీ:- 2022 డిసెంబర్​ 8 నేవీ ఎస్​ఎస్​ఆర్​ ఫామ్​ను సబ్మీట్​ చేసేందుకు చివరి తేదీ:- 2022 డిసెంబర్​ 17 ఎస్​ఎస్​ఆర్​ అప్లికేషన్​ ఫామ్​ సబ్మీట్​ చేయాల్సి మోడ్​:- ఆన్​లైన్​ (@joinindiannavy.gov.in వెబ్​సైట్​) అఫీషియల్​ వెబ్​సైట్​లో నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. తుది గడువు ముగిసిన తర్వాత అప్లికేషన్​కు వెసులుబాటు ఉండదు. తుది గడువు తేదీని పొడిగించే సూచనలు కూడా కనిపించడం లేదు. అర్హత:- Indian Navy Recruitment details : వయస్సు- అభ్యర్థులు 2005 అక్టోబర్​ 31 తర్వాత జన్మించి ఉండాలి. ఎడ్జ్యూకేషన్​- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన బోర్డు నుంచి 10+2 (మ్యాథ్య్​/ ఫిజిక్స్ కచ్చితంగా ఉండాలి.

బయోలాజీ/కెమిస్ట్రీ/ కంప్యూటర్​ సైన్స్​లో ఒకటైనా ఉండాలి​) వివాహం- ఇండియన్​ నేవీ రిక్రూట్​మెంట్​ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన వారికి పెళ్లి కచ్చితంగా జరిగి ఉండకూడదు. అన్​మారీడ్​ సర్టిఫికేట్​ ఇచ్చిన తర్వాత పెళ్లి జరిగినా డిస్​క్వాలిఫై చేసేస్తారు. ఈ 1400 పోస్టుల్లో 280 పోస్టులను మహిళలకు కేటాయించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ను చూడాల్సి ఉంటుంది. ఆన్​లైన్​లో ఎలా అప్లై చేయాలి? స్టెప్​ 1:- joinindiannavy.gov.in వెబ్​సైట్​లోకి వెళ్లాలి. స్టెప్​ 2:- ఈమెయిల్​ ఐడీ, పాస్​వర్డ్​తో రిజిస్టర్​ అవ్వాలి. Indian Navy Jobs : స్టెప్​ 3:- పోర్టల్​లోకి లాగిన్​ అయ్యి ‘కరెంట్​ ఆపర్చ్యూనిటీస్​’ మీద క్లిక్​ చేయాలి. స్టెప్​ 4:- ‘అప్లై’ బటన్​ మీద క్లిక్​ చేయాలి. స్టెప్​ 5:- అడిగిన వివరాలను ఫిల్​ చేయాలి. ఒకసారి రివ్యూ చేసుకోవాలి. స్టెప్​ 6:- స్కాన్​ చేసిన ఫొటోలు, సంతకం, థంబ్​ ఇంప్రెషన్​తో పాటు ఇతర డాక్యుమెంట్​లను అప్లోడ్​ చేయాలి. Agniveer SSR posts : స్టెప్​ 7:- ఫామ్​ను పూర్తిగా మరొక్కసారి చూసుకుని సబ్మీట్​ బటన్​ మీద క్లిక్​ చేయాలి. * అప్లోడ్​ చేసే ఫొటోలో.. బ్యాక్​గ్రౌండ్​ బ్లూ రంగులోనే ఉండాలి.