NationalTechnology

యూఐడీఏఐ.. అందుబాటులోకి కొత్త సర్వీసులు!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో తప్పనిసరి అయింది ఇలా ఒక వ్యక్తి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఎంతో కీలకమైనది ప్రస్తుతం మన వ్యక్తిగత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ అనుసంధానం కావడంతో ఆధార్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీస్లను అందుబాటులోకి తీసుకువస్తుంది యూఐడీఏఐ.ఈ క్రమంలోనే తాజాగా ఆధార్ కార్డుదారుల కోసం మరొక కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది తద్వారా ఆధార్ సేవలు ఇకపై మరింత సులభతరం కానున్నాయి.

యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త సర్వీసులు ని తీసుకు వచ్చింది. కొత్త సెక్యూరిటీ సేవలను లాంచ్ చేసింది. ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్ కోసం ఈ సేవలని తీసుకు రావడం జరిగింది.ప్రస్తుత కాలంలో ఆధార్ అనుసంధానం చేసుకొని అన్ని డాక్యుమెంట్స్ ఉండడంతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మోసపూరిత ట్రాన్సాక్షన్లను గుర్తించడం కోసం ఈ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ బేస్ట్ సెక్యూరిటీ మెకానిజం.

ఫింగర్ ప్రింట్ మెమినిషియా, ఫింగర్ ఇమేజ్ ఆధారంగా పని చేస్తుంది ఇది. ఫింగర్ ప్రింట్‌ను సరిగ్గా గుర్తిస్తుంది. ఫింగర్ ప్రింట్ అనేది చనిపోయిన వాళ్లదా కాదా అనేది తెలుస్తుంది.ఇలా చాలామంది ఫింగర్ ప్రింట్ ద్వారా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్లు జరుపుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఇది ఫింగర్ ప్రింట్ ను గుర్తించడంతో మోసాలకు చెక్ పెట్టవచ్చు. 2022 డిసెంబర్ చివరి నాటికి ఆధార్ బేస్డ్ అథంటికేషన్ ట్రాన్సాక్షన్లు 88.29 బిలియన్లు దాటాయి. తద్వారా ఇలాంటి మోస పూరిత ట్రాన్సాక్షన్లను అరికట్టడం కోసం యూఐడీఏఐ ఇటీవలనే ఏఐ లేదా ఎంఎల్ బేస్ట్ చాట్ బాట్ సర్వీసులు కూడా తెచ్చింది. అదే ఆధార్ మిత్ర. ఆధార్ నమోదు, ఆధార్ అప్‌డేట్, ఆధార్ పీవీసీ కార్డుల స్టేటస్ వంటి పలు రకాల సర్వీసులని పొందొచ్చు.