Technology

UPI ద్వారా ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేస్తున్నారా. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

ప్రస్తుత కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు అధికమయ్యాయి ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు.ఇలా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ఈ పొరపాట్లు కారణంగా పెద్ద ఎత్తున మోసానికి గురి కావాల్సి ఉంటుంది.ఈ క్రమంలోని యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసేవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడటం వల్ల డబ్బును నష్టపోకుండా ఉంటారు.

మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ కనుక చేస్తే పొరపాటున కూడా యూపీఐ కోసం చెల్లించే నాలుగు లేదా ఆరు అంకెల పిన్ నెంబర్ ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీరు పెద్ద ఎత్తున డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. ఇలా యూపీఐ ఆధారిత యాప్ కి కూడా లాక్ పెట్టుకోవడం ఎంతో మంచిది.ఇలాంటి పిన్ విషయంలో మీరు కనుక ఏమాత్రం అశ్రద్ధ వహించిన మీ అకౌంటు మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఇకపోతే సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే మీ మొబైల్ నెంబర్ కు ఆఫర్లు ఉన్నాయి అంటూ లింక్ పంపించే లింక్ పై క్లిక్ చేయమని కనుక మెసేజ్ వస్తే పొరపాటున కూడా అలాంటి లింక్ క్లిక్ చేయకూడదు.మీరు కనుక ఈ లింక్ క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాల చేతిలోకి మీ వ్యక్తిగత డేటా మొత్తం వెళ్ళిపోతుంది తద్వారా మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే పరిస్థితిలు ఏర్పడతాయి. ఇక ప్రతి ఒక్కరు రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్లను ఉపయోగించకపోవడం ఎంతో మంచిది. ఇలా రెండు కన్నా అధికంగా ఉండటం వల్ల మీరు కొన్నిసార్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉండి అధికంగా తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి.